వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాకలో గత ఆరు సంవత్సరాలుగా మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా ఉంది. గ్రామంలో ఒకే వాటర్ ట్యాంక్ ఉండడంతో ఎండాకాలంలో త్రాగునీటి సరఫరకు ఇబ్బందిగా ఉందని, గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ నిధులు 75 లక్షలతో కొంకపాకలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే ఆరురి రమేష్ 2018 ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు వాటర్ ట్యాంక్ నిరుపయోగంగానే ఉంది.