తీజ్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

54చూసినవారు
తీజ్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని నల్లకుంట, గోరుగుట్ట, ఇస్లావత్ తండ, ధరంసోత్ తండ, చెరువు కొమ్ము తండా, దూపతండ, పెద్ద తండాలలో గిరిజన బంజారా మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకునే తీజ్ పండగ ఉత్సవాల్లో లంబాడి సోదర సోదరీమణులతో కలిసి వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల పరిధిలోని జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు లంబాడి సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్