వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో గురువారం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, 14 వ రోజు స్థానిక సర్పంచ్ అమడగాని రాజు యాదవ్ హరితహరంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు. అనంతరం పిచ్చి చెట్లు, చెత్తను తొలగించడం, ప్లాస్టిక్ నిషేధం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అత్తి రేవతి కుమార్, స్పెషల్ ఆఫీసర్ అన్వేష, పంచాయితీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ ఉప్పలయ్య, వార్డు సభ్యులు మేకల రమేష్, సారంగం, మనోహర్, సునిత, మాధవి, కారోబార్ రమేష్, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, ఏలిషమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ రజిత, పుష్పలత, సీఏ కవిత, వాటర్ మెన్ కుమారస్వామి, స్టాండింగ్ కమిటీ మెంబర్స్, మహిళా సంఘాలు, గ్రామస్థులు, పాల్గొన్నారు.