బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ

54చూసినవారు
బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ
సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదనవు కలెక్టర్‌ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. గురువారం రాయపర్తి మండలంలోని సోషల్‌ వెల్ఫేర్‌ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల్లో గదులను, స్టాక్ రూమ్ ను, వంటలను పరిశీలించారు. విద్యా బోధన, హాస్టల్‌ పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్