ఆర్థిక సాయం చేసిన సర్పంచ్

928చూసినవారు
ఆర్థిక సాయం చేసిన సర్పంచ్
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ పంచాయతీలో గత 10 సంవత్సరాలుగా సిబ్బందిగా పనిచేస్తూ, ఎన్నో సేవలు చేస్తూ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన జిడి సంపూర్ణ కుటుంబ సభ్యులకు ఆ గ్రామ సర్పంచ్ గరిక సుష్మా పరామర్శించి, రూ.11 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామానికి ఎంతో సేవ చేసిన సంపూర్ణ మరణించడంతో గ్రామస్తులంతా ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. వారి వెంట ఉప సర్పంచ్, కార్యదర్శి కిషోర్, వార్డు సభ్యులు జీడీ గట్టయ్య, కిషోర్, రాజు, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్