వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే తనిఖీలో భాగంగా కలెక్టర్ సత్య శారద శనివారం వర్ధన్నపేట ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ పక్కాగా, జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. నవంబర్ 30 లోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీలో జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, సీపీఓ గోవిందా రాజన్, వర్ధన్నపేట తహసిల్దార్ విజయ సాగర్, తదితరులు పాల్గొన్నారు.