కాజీపేట మండలం కడిపికొండ గ్రామం నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్మెట్ట వెంకటరమణ గౌడ్, నర్మెట్ట వేణు గోపాల్ గౌడ్, స్వామి, సుధాకర్, రాజయ్య, సంపత్, కోటేశ్వరరావు బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పుస్తకాలు, పెన్నులు బహుమతిగా అందజేశారు.