ఎండలో పనిచేసే గర్భిణులకు హెచ్చరిక!

77చూసినవారు
ఎండలో పనిచేసే గర్భిణులకు హెచ్చరిక!
వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. విపరీతమైన ఎండలో పనిచేసే గర్భిణీ స్త్రీలకు అబార్షన్లు లేదా ప్రసవాలు జరిగే అవకాశం రెండింతలు ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. చలి ప్రాంతాలతో పోలిస్తే వేడిగా ఉండే ప్రాంతాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. వ్యవసాయం, ఇటుక బట్టీలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో పనిచేసే మహిళలపై అధ్యయనం చేసినట్లు చెన్నైకి చెందిన శ్రీహెర్ సంస్థ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్