‘కేంద్ర, రాష్ట్ర వివాదంతో ఢిల్లీలో నీటి సంక్షోభం’

79చూసినవారు
‘కేంద్ర, రాష్ట్ర వివాదంతో ఢిల్లీలో నీటి సంక్షోభం’
ఢిల్లీలో నీటి సంక్షోభంపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైషమ్యాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం విచారకరమన్నారు. ఇరు ప్రభుత్వాలు తమ రాజకీయ విభేదాలను విడనాడి నీటి సమస్యకు పరిష్కారం చూపాలని హితవు పలికారు. ప్రభుత్వాలు రాజకీయ పంతాలకు పోయి ప్రజలను సమస్యల్లోకి నెట్టడం సరైంది కాదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్