కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 150కి పైగా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. 200 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు.