వయనాడ్: ప్రాణాలతో బయటపడిన ఆ నలుగురు

67చూసినవారు
వయనాడ్: ప్రాణాలతో బయటపడిన ఆ నలుగురు
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వయనాడ్‌లోని పడవెట్టి కున్న ప్రాంతంలో చేపట్టిన ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న నలుగురిని ఆర్మీ గుర్తించింది. వెంటనే వారిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్