భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కేరళలోని వయనాడ్ అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందం బేలీ వంతెనలను ఉపయోగిస్తోంది. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాల నుంచి వీటిద్వారా ప్రజలను తరలిస్తున్నారు. ఈ పోర్టబుల్ వంతెన నిర్మాణానికి కావాల్సిన పరికరాలను ఢిల్లీ, బెంగళూరు నుంచి తెప్పించారు.పోర్టబుల్ బ్రిడ్జ్‌లను వాడిన దృశ్యాలను ఆర్మీ షేర్ చేసింది.