కేరళలో వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో వందలాదిమంది మరణించారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు.ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. కొండచరియలు విరిగిపడిన, వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన శశిథరూర్ ఆ తర్వాత తన పర్యటన మరిచిపోలేనిదని పేర్కొనడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.