ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. న్యూయార్క్, టోక్యోతో సమానంగా హైదరాబాద్ పోటీ పడుతోంది. రూ.7 వేల కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 2023 డిసెంబర్ 3కు ఒక ప్రత్యేకత ఉంది. 4 కోట్ల ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు. ప్రజా తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా అందరికి శుభాకాంక్షలు' అని చెప్పారు.