జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికను సీరియస్‌గా తీసుకుంటున్నామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఆ కమిటీ చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని ట్రిబ్యునల్, సినిమా చట్టాన్నీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న నేరాలపై కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు ఆయా విభాగాలు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.