రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు మాస్కోను ప్రతిఘటించడానికే పోరాడిన కీవ్ సేనలు.. తొలిసారి రష్యాకు చెందిన కస్క్‌ను ఆక్రమించాయి. ఈ ప్రాంతానికి చెందిన 74 స్థావరాలు తమ ఆధీనంలో ఉన్నాయని ఉక్రెయిన్ స్వయంగా ప్రకటించింది. దీనిపై స్పందించిన రష్యా.. కీవ్ పురోగతిని అడ్డుకుంటున్నామని, దాడులన్నీ తిప్పికొట్టామని పేర్కొంది. సంక్షోభం కొనసాగుతోందని, స్థానికులు సహనం పాటించాలని కస్క్ గవర్నర్ ప్రజలను కోరారు.