రైసీ మరణంతో మాకు సంబంధం లేదు: ఇజ్రాయెల్

1536చూసినవారు
రైసీ మరణంతో మాకు సంబంధం లేదు: ఇజ్రాయెల్
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మరణానికి తాము కారణమంటూ వస్తున్న వదంతులను ఇజ్రాయెల్ ఖండించింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. హమాస్ మిలిటెంట్లకు రైసీ సహాయం చేసిన విషయం తెలిసిందే. అలాగే స్వతంత్ర పాలస్తీనా పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు. దీంతో కొన్ని నెలలుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.

సంబంధిత పోస్ట్