తెలంగాణ అప్పులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. రూ.24 కోట్లకు పైగా అప్పులు మేము తీర్చామని చెప్పారు. 'ఈ ప్రభుత్వరూ.12,117 కోట్లను వడ్డీలు, అప్పుల పేరిట కట్టింది. మార్చి నుంచి ఇప్పటి వరకు మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పదేళ్లలో డైట్ చార్జీలు పెంచలేదు. కానీ తమ ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంచింది' అని తెలిపారు.