ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగితే ఆరోగ్యానికి ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ తాగినప్పుడు.. కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది గుండెల్లో మంట, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇతర కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్ మూత్రవిసర్జనను పెంచుతుంది. ఇంకా దీని వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో తలనొప్పి, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.