తెలంగాణలో కొత్త రహదారుల నిర్మాణ అంచనాలు పక్కాగా ఉండాలని, ఇష్టా రీతినా అంచనాలను సవరించొద్దని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. 'మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కాకతీయుల కాలం నాడు కట్టిన కట్టడాలు ఇంకా పటిష్టంగా ఉన్నాయి. అదే రీతిన రూరల్ ఇంజనీర్లు కట్టే నిర్మాణాలు 10 తరాలకు పనికిరావాలి. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం. నాసిరకం పనులకు ఎన్ఓసిలిచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటాం' అని హెచ్చరించారు.