AP: అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప-2 సినిమాను రాష్ట్రంలో అడ్డుకుంటామని జనసేన గన్నవరం నియోజకవర్గం నేత చలమలశెట్టి రమేశ్ బాబు హెచ్చరించారు. ‘మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్టపడుతుంది. నువ్వు ఒక్కడివే ఒళ్లు కొవ్వెక్కి వారికి వ్యతిరేకంగా ఉంటున్నావు. ఇప్పటికైనా చిరంజీవి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో. లేదంటే పుష్ఫ-2 సినిమాను అడ్డుకుంటాం.’ అని చలమలశెట్టి రమేశ్ బాబు అన్నారు.