నిరుద్యోగ యువతకు న్యాయం జరగేదాకా పోరాటం చేశాం: మంత్రి పొన్నం

75చూసినవారు
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో నిరుద్యోగ యువతకు న్యాయం జరగేదాకా పోరాటం చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్రంలో పాలన సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్