ప్రతిపక్షాలను తిట్టడమే సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నారని BRS ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ప్రజల కోసం కాకుండా కొందరి కోసం ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పేదల కోసం కాదు.. పెద్దల కోసం నడుస్తోందని విమర్శించారు. 'ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్టిస్తాం. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు.