కరీంనగర్ కలెక్టరేట్ వేదికపై తనను రెచ్చగొట్టిందే ఎమ్మెల్యే సంజయ్ అని BRS MLA కౌశిక్ రెడ్డి అన్నారు. 'నా బట్టలు చింపుతా నంటూ సంజయ్ వేదికపై రెచ్చగొట్టాడు. నేను ఏపార్టీ నీది అంటే నేను కాంగ్రెస్ పార్టీ, BRS కాదంటారు. ప్రజలు ఓట్లు వేస్తే నేను MLA అయ్యాను. నేను ఏ పార్టీ మారలేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొడతాం. కాంగ్రెస్ ఆఫీసుల మీద దాడులు చేస్తాం. కాంగ్రెస్ నాయకులను రోడ్ల మీద తిరగనివ్వం' అని హెచ్చరించారు.