AP: విశాఖ జిల్లా మల్కాపురం పీఎస్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కల్యాణి ఆస్పత్రి సమీపంలోని తీరప్రాంత రక్షకదళం నివాస సముదాయంలో ఈ ఘటన జరిగింది. మృతురాలు కోస్ట్ గార్డ్ కమాండర్ ఉద్యోగి భార్య ఆల్కాసింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఆమె పడి ఉన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.