ఆన్‌లైన్ గేమ్స్‌ కోసం తల్లిని చంపిన కొడుకు

71చూసినవారు
ఆన్‌లైన్ గేమ్స్‌ కోసం తల్లిని చంపిన కొడుకు
AP: విశాఖ జిల్లా మల్కాపురంలో దారుణం చోటుచేసుకుంది. డిఫెన్స్ ఫోర్స్ కోస్ట్‌లో ఓ మహిళ మృతదేహాన్ని కొంతమంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే మృతురాలు కోస్ట్ గార్డ్ కమాండర్ ఉద్యోగి భార్య ఆల్కా సింగ్‌గా గుర్తించారు. కాగా సొంత కుమారుడే చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన కొడుకుని మందలించడంతో ఆగ్రహానికి గురై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందిందని పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్