AP: ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద ఇచ్చే కండక్టర్ ఉద్యోగాలకు ఎత్తు నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. RTCలో 2016-19 మధ్యకాలంలో చనిపోయిన 16మంది కండక్టర్ల కుటుంబీకులకు ఈ పోస్టులు ఇవ్వనుండగా.. వారికి ఎత్తు నిబంధనల్లో మినహాయింపునిచింది. నిబంధనల ప్రకారం 154 సెంటీమీటర్ల ఎత్తు ఉండాల్సి ఉండగా, ఆ ఎత్తు లేనివారిని ఇన్నాళ్లూ కొలువులకు తీసుకోలేదు. తాజా ఉత్తర్వులతో వారందరికీ ఊరట లభించనుంది.