అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘వాషింగ్టన్ డీసీలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం నన్ను ఎంతో బాధించింది. మృతులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. అమెరికా ప్రజలకు సంఘీభావంగా నిలబడతాం’ అని మోదీ Xలో రాసుకొచ్చారు.