దేశంలో పేద, మధ్య తరగతిపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో యువతకు, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని తెలిపారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు తీసుకొస్తున్నామని, సమావేశాల్లో చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని మోడీ కోరారు.