కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులకు మరణశిక్ష విధించేలా అత్యాచార నిరోధక బిల్లును బెంగాల్ న్యాయ మంత్రి మోలోయ్ ఘటక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనికి 'అపరాజిత స్త్రీ, చైల్డ్ బిల్లు 2024'గా పేరు పెట్టారు. ఈ సందర్భంగా సీఎం మమతా మాట్లాడుతూ.. ఇలాంటి నేరాలను నిరోధించేందుకు సామాజిక సంస్కరణలు అవసరమన్నారు.