సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ ఆగస్టు 30వ తేదీ కేబినెట్ కొత్త సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల నుంచి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేస్తున్న రాజీవ్ గౌబ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించి, రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సోమనాథన్ కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. 2019 నుంచి 2021 వరకు కేంద్ర ఆర్థికశాఖ ఫైనాన్స్ ఎక్స్‌పెండిచర్ విభాగం కార్యదర్శిగా సేవలు చేశారు.