వామ్మో.. ఈ చేపల శబ్ధానికి చెవులు చిల్లు పడాల్సిందే!

63చూసినవారు
వామ్మో.. ఈ చేపల శబ్ధానికి చెవులు చిల్లు పడాల్సిందే!
'డేనియోనెల్లా సరీబ్రమ్' అనే చేపలు 10-12మి.మీ. పొడవుతో తళతళలాడుతూ అందంగా ఉంటాయి. కానీ, వీటి నుంచి వెలువడే శబ్ధం 140 డెసిబల్స్ వరకు ఉంటుంది. మాములుగా మనుషుల చెవులు 70 డెసిబల్స్ వరకు భరించగలవు. ఈ చేపలను తొలిసారిగా 1980లో గుర్తించారు. వీటి గొంతు వద్ద ధ్వనికండరాలు, మృదులాస్థి ప్రకంపనల ద్వారానే ఈ స్థాయిలో కూత పెట్టగలుగుతున్నాయని 3 ఏళ్ల కిందట ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.

సంబంధిత పోస్ట్