మహేష్ బాబు హీరోగా నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయిన నేపథ్యంలోదర్శకుడు కృష్ణవంశీ అభిమానులతో సోషల్ మీడియాలో చాట్ చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘‘మహేష్ తనయుడు గౌతమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రెండేళ్ల తర్వాత ‘మురారి’ సీక్వెల్ తెరకెక్కించండి’’ అని అడగ్గా.. ‘‘ఆ విషయాన్ని మీరు లేదా నేను చెప్పకూడదు. మహేశ్, నమ్రత, గౌతమ్ నిర్ణయించాలి. కాబట్టి వాళ్లనే డిసైడ్ చేయనిద్దాం’’ అని కృష్ణవంశీ బదులిచ్చారు.