స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అటువంటి స్త్రీని వంట గదికే పరిమితం చేశారు. మూఢనమ్మకాల పేరుతో దారుణంగా అణచివేశారు. అణగదొక్కబడిన మహిళల ఉపాధి భద్రత, 8 గంటల పని, కనీస వేతనం, ఓటు హక్కు కోసం పోరు సల్పారు. నాటి మహిళా స్ఫూర్తిని మననం చేసుకునేందుకు ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నారు.