తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. నేటి నుంచి కుటుంబ వివరాలను సేకరించన్నారు. మొత్తం 75 రకాల ప్రశ్నలపై కుల గణనలో వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ వివరాలన్నీ ఇస్తే.. తమకు ప్రయోజనం ఏంటని పలువురు ప్రశ్నలు వేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరికీ సమన్యాయం చేసేందుకే కుల గణన సర్వేను ప్రారంభించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకే ఈ సర్వేను చేస్తున్నామని ఆయన చెప్పారు.