ఫోన్ ట్యాపింగ్ చట్టం ఏమిటి?

56చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ చట్టం ఏమిటి?
ట్యాపింగ్ కు కేంద్రంలో కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్- 1885 ఫోన్ ట్యాపింగ్ గురించి చెబుతోంది. ఈ చట్టంలోని సెక్షన్ - 5(2) ప్రకారం దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల శ్రేయస్సు లాంటి అంశాల్లో రాష్ట్రం లేదా కేంద్రం ట్యాపింగ్ చేసే వీలు ఉన్నది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000లోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాల చెబుతోంది. ట్యాపింగ్ చేయాలనుకునే ప్రభుత్వం చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్