ఈ సారి వచ్చే తుఫాన్‌కు పేరు ఏంటంటే?

51చూసినవారు
ఈ సారి వచ్చే తుఫాన్‌కు పేరు ఏంటంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒకవేళ తుఫాన్‌గా మారితే దీనికి 'రెమాల్' అని నామకరణం చేయనున్నారు. ఈ పేరును ఒమన్ దేశం సూచించింది. రెమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరంలోని ఎనిమిది దేశాలు తుఫాన్ పేర్లను నిర్ణయిస్తాయి. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక ఈ జాబితాలో ఉన్నాయి. 2018లో ఇరాన్, ఖతర్, యెమన్, సౌదీ, యూఏఈ చేరాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్