2024లో తిరుమల శ్రీవారిని 2.55 కోట్ల మంది దర్శించుకున్నట్లు టీటీడీ పేర్కొంది. 2024 ఏడాదిలో తిరుమల వేంకటేశ్వరుడికి వచ్చిన మొత్తం హుండీ ఆదాయం వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ఏడాది శ్రీవారికి హుండీ ద్వారా రూ.1365 కోట్ల విలువైన కానుకలు అందాయని తెలిపారు. ఇక గత ఏడాది రూ. 1398 కోట్లు రాగా ఈ ఏడాది రూ. 33 కోట్ల ఆదాయం తగ్గిందని వెల్లడించారు.