పంజాబ్ సరిహద్దులో నిరసన తెలుపుతోన్న రైతులకు ఏదైనా జరిగితే అందుకు బీజేపీదే బాధ్యత అని ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. రద్దుచేసిన మూడు వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఆ విషయమై అభిప్రాయాల సేకరణకు అన్ని రాష్ట్రాలకు కొత్త పాలసీకాపీలు పంపారని పేర్కొన్నారు.