ఏపీలో వివిధ రకాల సర్టిఫికెట్లను ప్రజలు ఇబ్బంది లేకుండా పొందేందుకు ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. DOB, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 ధ్రువపత్రాలను వాట్సాప్‌లో అందిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ విధానంలో ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ సేవల్లో Alని కూడా ప్రవేశపెడతామని తెలిపారు.