తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు ఘోర ఓటమి ఖాయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కిషన్‌రెడ్డి మంగళవారం కౌంటర్ ఇచ్చారు. "గుజరాత్ వ్యాపారులు ప్రభుత్వాన్ని ఎందుకు కూలుస్తారు. రేవంత్ ఐదేళ్ల పాటు పాలన చేయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పాలనతో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు కాంగ్రెస్ ఓడిపోతుందని కామన్ మ్యాన్‌కు కూడా తెలుసు." అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.