పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో గాయపడిన బాలుడి ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు నివేదికను విడుదల చేశారు. శ్రీతేజ్‌కు ఇంకా వెంటిలేటర్ పైనే వైద్య సేవలు అందిస్తున్నట్లు సికింద్రాబాద్ కిమ్స్ డాక్టర్లు తెలిపారు. ట్యూబ్ ద్వారా అందిస్తున్న ఆహారాన్ని బాలుడు తీసుకోగలుగుతున్నాడని చెప్పారు. కాగా కొందరు బాలుడి ఆరోగ్యం విషయంలో దుష్ప్రచారాలు చేస్తున్నారని అల్లు అర్జున్ టీమ్ ఆరోపించింది.