రాష్ట్ర విభజన కంటే.. వైసీపీ ప్రభుత్వం వల్లే ఎక్కువ నష్టం: సీఎం చంద్రబాబు

76చూసినవారు
రాష్ట్ర విభజన కంటే.. వైసీపీ ప్రభుత్వం వల్లే ఎక్కువ నష్టం: సీఎం చంద్రబాబు
2047 విజన్ అనేది వ్యక్తి కోసం, కులం కోసం కాదని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెచ్చేందుకు ఇచ్చే హామీ అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులను వైసీపీ అడ్డుకుందన్నారు. 3 రాజధానుల పేరుతో అమరావతిపై కక్షతో వ్యవహరించారన్నారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్