డిఫరెంట్ రోల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు నటి లావణ్య త్రిపాఠి. లావణ్య ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా ‘సతీ లీలావతి’. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శృతి)తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు, రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.