మహిళలకు రూ.2,500 ఎక్కడ?: ఎమ్మెల్సీ కవిత

50చూసినవారు
మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా వారిని కాంగ్రెస్ ప్రభుత్ం మోసం చేసిందని ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, కళ్యాణమస్తు కింద ఆడబిడ్డలకు తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా ఈ హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 51% ఉన్న మహిళలు ప్రభుత్వానికి సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు.

సంబంధిత పోస్ట్