దొరకని మలావి వైస్ ప్రెసిడెంట్ ఆచూకీ

53చూసినవారు
దొరకని మలావి వైస్ ప్రెసిడెంట్ ఆచూకీ
ఆఫ్రికా దేశమైన మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమా ప్రయాణిస్తున్న విమానం సోమవారం తప్పిపోయింది. ఆ మిలిటరీ విమానలో ఆయనతో పాటు మరో 9 మంది ఉన్నారు. ప్రతికూల వాతావరణం వల్ల విమానం ల్యాండింగ్ కాలేకపోయింది. రాడార్ నుంచి విమానం అదృశ్యమైనప్పటి నుంచి దాని జాడ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఆ విమానాన్ని కనుగొనే వరకు రెస్క్యూ, సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా ప్రకటించారు.

ట్యాగ్స్ :