పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించిన మూడు దేశాలు ఏవి?

74చూసినవారు
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించిన మూడు దేశాలు ఏవి?
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ ప్రకటించాయి. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్‌ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. తూర్పు జెరూసలేేం, వెస్ట్‌బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను కలిపి ప్రత్యేక పాలస్తీనా దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967లో జరిగిన మిడిల్‌ ఈస్ట్‌ యుద్ధంలో ఆ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది.

సంబంధిత పోస్ట్