ఐపీఎల్ మెగా వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ.23.75 కోట్లు వెచ్చించింది. దీంతో అతడికే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించారంతా. కానీ వెంకటేశ్‌కు కాకుండా జట్టు పగ్గాలను అనుభవజ్ఞుడైన అజింక్య రహానెకు అందివ్వాలని ఆ ఫ్రాంచైజీ నిర్ణయించిందని సమాచారం. రహానె 90 శాతం ఖరారయ్యాడని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, వేలం ఆఖర్లో రహానెను రూ.1.50 కోట్ల కనీస ధరతో కేకేఆర్ సొంతం చేసుకుంది.