బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు వారసుడెవరనే ప్రశ్నకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానమిచ్చారు. 'గులాబీ బాసే మరో మూడు-నాలుగేళ్లలో సీఎం అవుతారు. ప్రజలు, పార్టీనే వారసుడిని నిర్ణయిస్తుంది. కేసీఆర్ వంటి నాయకుడి కింద పనిచేయడమే మా అదృష్టం. తిరిగి కేసీఆర్‌ను సీఎంగా చూడటమే నా లక్ష్యం. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారికి పార్టీలో బాధ్యతలు ఉన్నాయి' అని స్పష్టం చేశారు.