నూతన విద్యా విధానం 2020 ప్రకారంవిద్యార్థులు వారి మాతృభాషతో పాటుగా ఏదైనా భారతీయ భాష ఎంచుకునే సౌలభ్యం ఉందని జనసేన పార్టీ తెలిపింది. "ఎందుకని కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసం హిందీని రుద్దుతున్నారు అనే అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారు? హిందీ బదులుగా కావాలంటే భారతీయ భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం తదితర ఇలా భారతీయ భాషను నేర్చుకోవచ్చు కదా?" అని శనివారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.